కుటుంబ ఐకమత్యం
ఈ పుస్తకంలో కుటుంబ వ్యవస్థకు ఇస్లాం ధర్మం ఇస్తున్న ప్రాధాన్యత చక్కగా వివరించబడింది. మొట్టమొదటి కుటుంబ పునాదులైన తల్లిదండ్రుల గురించి, వివాహం యొక్క అసలు ఉద్దేశ్యం గురించి, భార్యలను ప్రేమగా, చక్కగా చూడవలసిన బాధ్యత గురించి, ఇంట్లో శాంతిసుఖాలు నెలకొల్పడంలో వారి ముఖ్యపాత్ర గురించి, ఇంటిని శాంతినిలయంగా మార్చటంలో భార్యాభర్తల పాత్ర గురించి మరియు వారి పరస్పర హక్కులు మరియు బాధ్యతల గురించి, తల్లిదండ్రులపై సంతానానికి ఉన్న హక్కుల గురించి మరియు ఇతర బంధువులతో సత్సంబంధాలు కొనసాగించవలసిన అవసరం గురించి ఇక్కడ క్లుప్తంగా చర్చించబడింది.